కోడూరి విజయకుమార్ – కవిత

పేదవాడి ప్రేమ పాట

నేల విడిచి గాల్లోకి తెలిపోవడాలు  వుండవు 

ప్రపంచం పంచరంగుల్లో కన్పించడాలు వుండవు 
పేదరికం పురా వీణ తంత్రులు
అప శ్రుతుల ఆకలి ప్రకంపనల్నే తప్ప 
శృతి చేసుకుని ఒక వలపు గీతాన్ని వినిపించలేవు 
ఉదయం లేచింది మొదలు 
జ్ఞానేంద్రియాలన్నీ ఆకలి కేంద్రాలై 
నాలుగు మెతుకుల కోసం గానుగెద్దయ్యేవాడికి 
రాత్రుళ్ళు గాయాల్ని తడుముకుని తల్లడిల్లడమే  తప్ప  
ప్రేమ కలల పల్లకీలో వూరేగి పోవడాలు వుండవు 
పేదరికం కారుమేఘాలు 
ఆకలి వురుముల్నీ, అసహనం మెరుపుల్నీ తప్ప 
దారి తొలగి వలపు వెండి వెన్నెల్ని కురిపించవు 
కరెన్సీకి కరువు లేని కథానాయకుడు 
దేశాల సరిహద్దులు దాటి కథానాయికని చేరడం 
కమనీయ వెండి తెర కథవుతుంది 
చప్పట్లుండవు …విజిల్లుండవు 
కలవారి ప్రేమకతలకే తప్ప 
నిరుపేదల ఆకలి వెతలకు 
బాక్సాఫీసు దగ్గర కనక వర్శాలుండవు …..
అన్నమ్ముద్దకు తప్ప 
అందమైన చిరునవ్వుకు చలించని వాడినీ 
జీవిత పటంమీద విరక్తి సంతకమైన వాడినీ 
ఏ రాసానుభూతులూ రక్తి కట్టించవు 
తొలిచూపుల పల్లవింపులు వుండవు 
అద్భుత గమకాల చరణాలు వుండవు 
అరుదుగా గుండె అట్టడుగు పొరల్ని 
పెగల్చుకు వొచ్చినా 
పేదవాడి ప్రేమపాటని 
ఎవరూ హర్షించరు ……
 
*5.7.2012
Advertisements

One response to “కోడూరి విజయకుమార్ – కవిత

  1. ఉదయం లేచింది మొదలు జ్ఞానేంద్రియాలన్నీ ఆకలి కేంద్రాలై నాలుగు మెతుకుల కోసం గానుగెద్దయ్యేవాడికి… గుండెను కుదిపే వ్యక్తీకరణ!మీ కవితలు పత్రికలలో వచ్చినప్పుడు చదువుతుంటాను.కొన్ని నా file లో వున్నాయి కూడా విజయ్ కుమార్ గారు! మంచి కవిత్వం రాస్తున్నారు.

అభిప్రాయాన్ని చెప్పండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s